రంగస్థ‌లం పై వ‌ర్మ కామెంట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-14 02:16:53

రంగస్థ‌లం పై వ‌ర్మ కామెంట్

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గ‌త కొద్ది కాలంగా ఏదో ఒక విష‌యంపై  సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు... గ‌త నెలలో వ‌ర్మ‌ అమెరిక‌న్ పోర్న్ స్టార్  మియా మాల్కోవాతో తెర‌కెక్కించిన‌ వెబ్ సిరీస్ చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తో మ‌రింత చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చారు... 
 
అయితే జీఎస్టీ  సినిమా తర్వాత కొంత కాలం పాటు సైలెంట్ గా ఉన్న వ‌ర్మ... మ‌రోసారి  సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ తాజా చిత్రం రంగస్థ‌లం పై స్పందించారు ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌... ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్, సాంగ్ విడుద‌ల కాగా,  అభిమానుల నుంచి దీనిపై ఎంతో స్పంద‌న వ‌స్తోంది.
 
వర్మ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో  రంగస్థ‌లం సినిమాపై స్పందిస్తూ... తన‌కు కూడా ఈ సినిమా ట్రైల‌ర్ న‌చ్చింద‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ అచ్చ‌మైన గోదావ‌రి భాష యాస‌లో చిత్రించార‌ని ట్విట్ చేశారు వ‌ర్మ‌.. అలాగే చిత్ర‌ యూనిట్ విడుద‌ల చేసిన సాంగ్ కూడా త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని, ఈ పాట‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుతంగా మ్యూజిక్ అందించార‌ని ట్విట్ చేశారు వ‌ర్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.