వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-16 12:36:46

వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.   సామాజిక కార్యకర్త,  మహిళ సంఘం నాయకురాలు దేవి..... వ‌ర్మ  త‌న‌ను అవ‌మానించారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌హిళ‌ల‌ గౌర‌వానికి తూట్లు పొడుస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుని శిక్షించాల‌ని ఆమె కోరారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్శకుడు వ‌ర్మ అరెస్ట్ చేసేందుకు సిద్దం అవుతున్న‌ట్లు  తెలుస్తోంది.
 
గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాను ఎవరైనా వ్య‌తిరేకిస్తే  వ్య‌క్తి గ‌తంగా దాడి చేస్తానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని  కేసులో ఆమె పేర్కొన్నారు.  దేవి కేసును ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న పోలీసులు వ‌ర్మ పై ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
ఇటీవల ఓ టీవీ చర్చా కార్యాక్రమంలో పాల్గోన్న వారిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌లు చేసుకున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన వాటిని బ‌హిరంగంగా చిత్రీక‌రించి స‌మాజ వినాశ‌నానికి పాల్ప‌డుతున్నారంటూ వ‌ర్మ‌ను విమర్శించారు దేవి. త‌ల్లి లాంటి మ‌హిళ‌ను స‌మాజంలో అవ‌మాన ప‌రుస్తున్నారంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. దీనికి స్పందించిన దర్శకుడు వర్మ... స‌మాజానికి నేనే ఒక ఐకాన్ అన్న‌ట్లుగా  దేవి ఆలోచిస్తుంద‌ని అని ఎద్దేవా చేశారు. గ‌తంలో కూడా అనేక చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో వీరిద్ద‌రూ  పరస్పరం  విభేదించుకున్న విషయం అంద‌రికి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.