వ‌ర్మ ట్వీట్ బాణాలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-07 12:27:39

వ‌ర్మ ట్వీట్ బాణాలు

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ, కొద్ది కాలంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని, ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌పై అటు న‌టీ న‌టుల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు... తాజాగా ఆయ‌న నిర్మించిన  వెబ్ సిరీస్ చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్... ఈ సినిమా దేశ‌వ్యాప్తంగా  సెన్సేష‌న‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే.... మ‌రొవైపు ఈ చిత్రాన్ని వ్య‌తిరేకిస్తూ మ‌హిళా సంఘాల వ‌నిత‌లు వ‌ర్మ‌పై పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు... ఇలా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తున్నారు వ‌ర్మ‌.
 
అయితే ఈ నేప‌థ్యంలో మ‌రోసారి  వ‌ర్మ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని త‌మిళ స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... త‌లైవా రాజ‌కీయ అరంగేట్రంపై అలాగే 2.0 చిత్రంపై త‌న‌దైన శైలిలో ట్విట్ చేశారు వ‌ర్మ‌...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో భారత్‌ కూడా ఒక దేశమ‌ని, అదే రజనీకాంత్‌ ప్రధానమంత్రి అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుందని. 2.0 నుంచి 200.0 కు చేరుతుందని  వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కోన్నారు..
 
అలాగే మరో ట్వీట్‌ లో వ‌ర్మ...శివ సినిమాతో నాగార్జున నాకు కిక్ స్టార్ట్ ఇచ్చాడని, ఇన్నేళ్ల తరువాత నాకు మరో కిక్ కావాలని, రిలీజ్ డేట్, టైమ్ త్వరలోనే ప్రకటిస్తాన్నారు వ‌ర్మ‌.. ఒక‌వేళ నాగార్జునతో హిట్ కొట్టకపోతే ఆయన ఫ్యాన్స్ నన్ను తన్నేందుకు సిద్ధంగా ఉన్నారని ట్విట్ట‌ర్ లో పేర్కోన్నాడు వ‌ర్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.