బాల‌య్య‌కు షాక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and director teja
Updated:  2018-04-26 12:41:08

బాల‌య్య‌కు షాక్

ఇటు టాలీవుడ్ లో కానీ అటు బాలీవుడ్ లో కానీ కొంత‌ కాలంగా బ‌యోపిక్ ల హ‌వా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే... అయితే ఈ క్ర‌మంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు తేజ ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు...ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర‌లో హీరో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు... ఇక ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి  రెగ్యుల‌ర్ షూటింగ్ ముహూర్తానికి  టెంకాయ కొట్టిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో హీరో బాల‌కృష్ణకు ద‌ర్శ‌కుడు తేజ కు మ‌ధ్య అనూహ్య‌ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది... దీంతో తాను ఈ సినిమా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తేజ నిన్న ప్రకటించారు..ఈ నిర్ణ‌యంతో  సినీ ఇండస్ట్రీతో పాటు నంద‌మూరి అభిమానులకు కూడా తేజ  షాక్ కు గురిచేశారు.
 
ఇంత స‌డ‌న్ గా తేజ ఈ సినిమా నుంచి ఎందుకు త‌ప్పుకున్నారు అన్న సందేహం ప్ర‌తీ ఒక్క‌రి మ‌దిరి తొలుస్తోంది.. అయితే తాజా ఫిలిమ్ ఇండ‌స్ట్రీ స‌మాచారం మేర‌కు వేటగాడు చిత్రంలోని హిట్ సాంగ్ తో పాటు, జయలలితతో ఎన్టీఆర్ చేసిన ఓ హిట్ డ్యూయెట్ ఈ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని బాలకృష్ణ చెబితే అందుకు తేజ అంగీకరించలేదని దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య  విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.... 
 
 
ఇక బాల‌య్య దీంతో ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు -  క్రిష్ ను ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని కోరార‌ట, అయితే వారు ప్ర‌స్తుత ప్రాజెక్టుల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల కుద‌ర‌దు అన్నార‌ని తెలుస్తోంది... అయితే బాలయ్య స్వియ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కే అవ‌కాశం ఉంది అని స‌మాచారం.  మ‌రి చూడాలి ఎందుకంటే ఎన్నిక‌ల‌కు ముందే ఈ సినిమా విడుదల చేయాలి అనే నిర్ణ‌యంతో బాల‌య్య ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.