షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన వ‌ర్మ ల‌క్ష‌రూపాయ‌లు బ‌హుమ‌తి కూడా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director ram gopal varma
Updated:  2018-10-13 03:34:46

షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన వ‌ర్మ ల‌క్ష‌రూపాయ‌లు బ‌హుమ‌తి కూడా..

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌బోతున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్ప‌టికే  ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ కు టెంకాయ కొట్ట‌నున్నార‌ని వ‌ర్మ తాజాగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెసిసిందే. 
 
ఈ నేప‌థ్యంలో వ‌ర్మ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా ల‌క్ష రూపాయ‌లు బ‌హూమ‌తిని కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇంతకు రామ్ గోపాల్ వ‌ర్మ ఏ వీడియో పోస్ట్ చేశారంటే నిక్క‌ర్ బ‌నియ‌న్ వేసుకుని అచ్చం ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు లాగా ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేవారు.
varma
 
హోట‌ల్లో భోజ‌నం చేయ‌డానికి వ‌చ్చిన క‌ష్ట‌మ‌ర్ల‌కు ప‌చ్చ‌డి వేస్తు వెళ్లిన వీడియోని పోస్ట్ చేసిఈ వ్య‌క్తి ఎక్క‌డైన క‌నిపిస్తే త‌న‌కు తెలియ‌చేయ్యాల‌ని అలాగే ఆయ‌న ఆచూకి చెప్పిన వారికి ల‌క్ష‌రూపాయాలు బ‌హుమ‌తి ఇస్తాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. అంతేకాదు Laksmisntr@gmail.com అనే మెయిల్ ద్వారా కూడా తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment