బోనీ క‌పూర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

boney kapoor and sridevi image
Updated:  2018-02-27 05:51:17

బోనీ క‌పూర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయి సుమారు మూడు రోజులు కావ‌స్తున్నా దుబాయ్ నుంచి పార్ధీవ దేహాన్ని ఇంత వ‌ర‌కూ  తీసుకురాలేదు... దీంతో ఆమె మృతిపై అనేక అనుమానాలు వెలుగు చూస్తున్నాయి... శ్రీదేవి మ‌ర‌ణం స‌హ‌జ‌మా, లేక... అస‌హ‌జ‌మా అన్న కోణంలో తేల్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు దుబాయ్ పోలీసులు...అయితే తాజాగా డ్రీమ్ గ‌ర్ల్ మ‌ర‌ణం వెనుక అనేక అనుమానాలు త‌లెత్త‌డంతో ముందుగా కుటుంబ స‌భ్యులను విచారిస్తున్నారు అధికారులు.
 
ఈ విచార‌ణ‌లో శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్  ఆమె ప్రాణాలు కోల్పోయిన స‌మ‌యంలో అక్క‌డే ఉండ‌డంతో ముందుగా అత‌నిని దుబాయ్ అధికారులు విచారిస్తున్నారు... ఈ విచార‌ణ‌లో పోస్ట్ మార్టం రిపోర్టు వివ‌రాల‌కు, బోనీ క‌పూర్ విచార‌ణ వివ‌రాల‌కు భిన్నంగా ఉన్నాయ‌ని తేల‌డంతో త‌నిని అరెస్ట్ చేయడం త‌ధ్యం అని ఓ ప్ర‌ముఖ మీడియా పేర్కొంది.
 
అయితే నిన్న మూడు గంటలపాటు విచారించిన బోనీకపూర్ ను నేడు మరోసారి విచారించనున్నారు. ఈ విచార‌ణ‌లో దుబాయ్ పోలీసులు ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ ను,మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు... దీంతో పాటు దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించార‌ట‌... శ్రీదేవి, బోనీకపూర్ కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.