శృతి హసన్ ని తిడుతున్న నెటిజన్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine shruti haasan
Updated:  2018-08-09 12:23:35

శృతి హసన్ ని తిడుతున్న నెటిజన్స్

హాట్ భామ అయిన శృతి హసన్ ని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ తిట్టేస్తున్నారు అందరూ నెటిజెన్స్. అసలు మ్యాటర్ ఏంటంటే దేశం మొత్తం కరుణానిధి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తుంటే శృతి హసన్ మాత్రం కరుణానిధి గురించి ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు అంట, పైగా నేను లండన్ వెళ్లానని అక్కడ ఓ ఆల్బమ్ చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా ఓ ఫోటో ని సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా శృతి పై నిప్పులు చెరిగారు నెటిజన్లు.
 
గతకొంత కాలంగా శృతి హాసన్ కు సరైన సినిమాలు లేకుండా పోయాయి దాంతో లండన్ లో లవర్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది శృతి హసన్. ముంబై లో నివసిస్తున్న ఈ భామ తాజాగా ఓ ఆల్బమ్ కోసం లండన్ వెళ్లిందట. హాయిగా సినిమాలు వస్తుంటే చేసుకోకుండా దేశాల మీద పడి తిరుగుతుంది అని అన్న వారు లేకపోలేదు.
 
ఇదిలా ఉంటే తెలుగు లో శృతి హసన్ నటించిన ఆఖరి సినిమా "కాటమరాయుడు". ప్రస్తుతం ఆమెకి ఆఫర్స్ ఇవ్వడానికి తెలుగు నిర్మాతలు రెడీ గా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.