ఈ కార‌ణంతోనే ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లిపోతున్నాం..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

fight masters ram lakshman
Updated:  2018-09-11 05:10:21

ఈ కార‌ణంతోనే ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లిపోతున్నాం..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఉన్న ఫైట్ మాస్టర్స్ అందరూ పక్క రాష్ట్రం వాళ్ళే, కానీ తెలుగు నుంచి ఫైట్ మాస్టర్స్ గా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం రామ్ లక్ష్మణ్. ఈ ఇద్దరు కవల ఫైట్ మాస్టర్స్ గత కోనేళ్ళుగా తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం సినిమాలని ఫైట్స్ ని అందిస్తున్నారు. ఇలా వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు దాదాపు పదకొండు వందల సినిమాలకి ఫైట్స్ ని అందించారు. అయితే
 
ఇలాంటి ఫైట్ మాస్టర్స్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకు గుడ్ బై చెప్పి తాము పుట్టి పెరిగిన సొంత గ్రామం కారంచెడులో సెటిల్ కావాలనేది వీరి ఆలోచన. తమ గ్రామం కేంద్రంగా కొన్ని సామజిక కార్యక్రమాలు చేసే ఆలోచనలో రామ్ లక్ష్మణ్ ఉన్నారు. ఇప్పుడు కూడా వీరి చేతుల్లో క్రేజీ ఆఫర్స్ ఉన్నారు.
 
మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "సై రా నరసింహ రెడ్డి" లోని కొన్ని ఫైట్ సీన్స్ ని వీళ్ళే చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు "మహర్షి" సినిమాకి కూడా వీళ్ళే ఫైట్ మాస్టర్స్ . ఇక సినిమాలు వదిలేసే విషయం గురించి రామ్ లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.