ఆ డైరెక్ట‌ర్‌ని చెప్పుతో కొట్టాను...ముంతాజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor mumtaj
Updated:  2018-10-23 02:50:29

ఆ డైరెక్ట‌ర్‌ని చెప్పుతో కొట్టాను...ముంతాజ్

సినీ నటి ముంతాజ్.. ఈ పేరు తో పిలిస్తే గుర్తుపట్టడం కష్టమేమో కానీ, గజ్జగల్లుమన్నాదిరో-గుండె జల్లుమన్నాదిరో అంటూ ఖుషి సినిమా లో హీరోయిన్ అంటే గుర్తురాని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. ఖుషి తరువాత కనుమరుగై, మళ్ళీ అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అలరించిన ఈ బొద్దుగుమ్మ తమిళ్ బిగ్ బాస్ షో తో అక్కడ పాపులర్ అయ్యింది.

ముంతాజ్ ఇటీవలి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. లైంగిక వేదింపుల బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలు సార్లు నేను లైంగికంగా వేదించబడ్డాను. అయితే వాటిని నేను ఓపిక ఉన్నంత వరకు భరించేదాన్ని అంతకు మించి నన్ను విసిగిస్తే లైంగికంగా వేదిస్తే మాత్రం సీరియస్ గా స్పందించేదాన్ని. ఒక సినిమా షూటింగ్ సమయంలో నాతో దర్శకుడు పదే పదే అసభ్యంగా ప్రవర్తించడంతో సహనం కోల్పోయి అతడిని చెప్పుతో కొట్టాను.

అప్పుడు అంతా షాక్ అయ్యారు. ఘాటుగా స్పందిస్తే తప్ప లైంగిక వేదింపు నుండి ఆడవారు తమని తాము రక్షించుకోలేరు అని చెప్పింది. ఇక పోతే ఇవి మీటూ ఉద్యమం కి సంబంధించిన వ్యాఖ్యలు అయితే కాదు అని తేల్చి చెప్పింది. నేను మీటూ లో భాగస్వామి కాదల్చుకోలేదు అని, ఇవి కేవలం నా అనుభవాలు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మీటూ అంటూ సెలెబ్రెటీల మీద నిందలు వేసేవాళ్ళు కాస్త ఆలోచించు కోవాలని, నింద వేసి పబ్బం గడుపుకుంటే సరిపోదు, తగిన ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చెయ్యాలని సూచించింది.