ఆది గురించి కొన్ని ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

adhi image
Updated:  2018-03-13 11:39:04

ఆది గురించి కొన్ని ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు

బుల్లి తెరలో ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ లో  ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో మ‌నంద‌రికీ తెలిసిందే.. ఈ షోలో అతి త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ఫేమ్ ను సంపాదించుకున్నారు హైప‌ర్ ఆది... త‌న స్కిట్ లో పంచుల‌ను సంచుల్లో  నింపుతూ తెలుగు వారిని క‌డుపు నిండా న‌వ్విస్తూ ఉంటాడు హైప‌ర్ ఆది ..
 
అయితే తాజాగా హైప‌ర్ ఆది ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.. ఈ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు ఆ మీడియాతో పంచుకున్నారు ఆది.. తాను స్కూల్ ల్లో చ‌దువుకుంటున్న‌ స‌మ‌యంలో చాలా అల్ల‌రి చేసేవాడిన‌ని, అల్ల‌రి చేయ‌వ‌ద్దు అని నాతోటి మిత్రులు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడిని కాద‌ని చెప్పారు ఆది..
 
అంతేకాకుండా నేను స్కూలుకు వెళ్లానంటే నేను వ‌చ్చిన‌ట్లు అంద‌రికి తెలిసిపోయేద‌ని అన్నారు... దీంతో పాటు ఫలానా క్లాస్ లో ఆది అనేవాడు వుంటాడు .. వాడు బాగా గొడవ చేస్తాడు అని చెప్పుకునేవారని అన్నారు..... అంత గోల చేసేవాడిగా పేరున్నాకానీ చదువులో మాత్రం ఎప్పుడూ వెనుకబడలేదు అన్నారు ఆది... బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునేవాడిని...అయితే ఒక్కోసారి కొన్ని కార‌ణాల‌కు తాను బాధ్యుడిని కాకపోయినా, క్లాస్ లో నుంచి నన్నే బయటికి పంపించేవాళ్లని హైప‌ర్  ఆది అన్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.