హాట్ భామ కాదు ఫ్లాప్ భామ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 11:26:11

హాట్ భామ కాదు ఫ్లాప్ భామ

ఇప్పటివరకు అరడజను సినిమాలలో మెరిసిన ముద్దుగుమ్మ అను ఇమ్మనుయెల్. కాని ఎం లాభం ఒక్క హిట్టు కుడా తన ఖాతాలో లేదు. సాధారణంగా మొదటి సినిమా హిట్ కాకపోతే పెట్టేబేడా సర్దేసి సాగనంపే టాలీవుడ్ లో అరడజను సినిమాల వరకు నిలదొక్కుకుంది అంటే గొప్ప విషయమే. బాగా డబ్బున్న ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు తప్ప అన్ని ఫ్లాపులను తట్టుకోలేరు.
 
నాచురల్ స్టార్ నాని తో కలిసి మొదట ‘మజ్ను’లో కనిపించిన ఈ సుందరి పరవలేదనిపించుకుంది. ఆ తర్వాత కిట్టుగాడున్నాడు జాగ్రత్త లో యువ హీరో రాజ్ తరుణ్ సరసన కనబడి కొన్ని అందచందాల్ని చూపించింది. కాని ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఆ తరవాతా గోపీచంద్ తో కలిసి ఆక్సిజన్ లో ఆడిపాడింది. అది కుడా ప్లాప్.
 
వరుసగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసినా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కంట్లో పడిపోయింది. ఇంకేముంది, అజ్ఞ్యతవాసి లో హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యి పవన్ కి లవర్ గా నటించేసింది. ఇక్కడకూడా తన లక్ మారలేదు సరికదా ఎన్నో ఆసలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు అనుభవం మిగిల్చింది.ఇప్పుడు తాజాగా ఆమె శైలజారెడ్డి అల్లుడు లో నాగ చైతన్య సరసన నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం తీవ్రమైన పోటిని ఎదుర్కొంటోంది. ఒక పక్క యు-టర్న్ విశేష జనాదరణ పొందడం, మరోపక్క శైలజా రెడ్డి అల్లుడు లో సరైఅన కామెడి లేకపోవడం వెరసి ఈ చిత్రం కూడా పరాజయం పొందేలా కనిపింస్తుంది. ఇంతటి బాడ్ లక్ లో కుడా అను ఇమ్మానుయెల్ మంచి అవకాశాలు కొట్టేస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా కొనసాగుతుందో చూడాలి మరి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.