గీత గోవిందం సెన్సార్ పూర్తి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

geetha govindam
Updated:  2018-08-13 03:06:39

గీత గోవిందం సెన్సార్ పూర్తి

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “గీత గోవిందం”. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని "సోలో" ఫేమ్ అయినా పరుశురాం దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్2 పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా  మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ఈ చిత్రానికి  సంగీతం అందించారు.
 
ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు "యూ/ఏ" సర్టిఫికెట్ అందించింది, ఇక ఈ చిత్ర రన్ టైం 149 నిమిషాలుగా తెలుస్తోంది, పూర్తి స్థాయి లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కాలేజీ లెక్చరర్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక సాఫ్ట్ వెర్ ఉద్యోగినిగా నటించింది, ఇద్దరి మధ్య నడిచే హైలైట్ గా ఉండబుతున్నట్లు సమాచారం.
 
ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం  తర్వాత విజయ్ "నోటా" అనే చిత్రంలో నటిస్తున్నాడు, తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఆ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

 

షేర్ :

Comments

0 Comment