టీజర్ రిలీజ్ కు సిద్దమైన గీత గోవిందం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

geetha govindam poster
Updated:  2018-07-20 12:02:55

టీజర్ రిలీజ్ కు సిద్దమైన గీత గోవిందం

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, "ఛలో" ఫేమ్ అయినా రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “గీత గోవిందం”. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  "సోలో" "ఆంజనేయులు" ఫేమ్ అయినా పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ఇక ఈ చిత్రాన్ని బన్నీవాసు, గీత ఆర్ట్స్2 బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం టీజర్ ఈ నెల 22న ఉదయం 11:05 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విజయ్, రష్మికలు జంటగా ఉన్న ఒక ఆసక్తిగల పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
 
ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇటీవలే విడుదలైన "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే" పాట ఇప్పుడు టాప్ సాంగ్ లిస్ట్ లో ఉంది, సీడ్ శ్రీరామ్ పడిన ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాయగా విడుడుదలైన రోజు నుంచి ఈ పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది, ఇక ఈ ఇక ఈ చిత్రంతో పాటుగా విజయ్ తమిళ-తెలుగు భాషల్లో "నోటా" అనే చిత్రం చేస్తున్నాడు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.