చేదు “సమ్మోహనం” చూపించిన ముంబై కుర్రాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sammohanam
Updated:  2018-09-21 02:59:51

చేదు “సమ్మోహనం” చూపించిన ముంబై కుర్రాడు

“సమ్మోహనం” చిత్రంలో ఒక సినీ హీరోయిన్ ఒక మాములు కుర్రాడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద తీశారు. ప్రేక్షకులు దానిని మెచ్చి మంచి విజయాన్ని కూడా ప్రసాదించారు. కానీ నిజ జీవితంలో ఇలాంటివి నూటికి నూరుపాళ్లు జరగవని అందరికి తెలుసు. కానీ ఇది నిజ జీవితంలో కూడా జరిగింది. కానీ క్లైమాక్స్ మారింది. ఈ సంఘటన ముంబై మహానగరం లో జరిగింది.
 
సినీనటి కాకపోయినా మోడల్ గా ఉన్న ఒక యువతిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటు వెంటపడ్డాడు ఒక కాలేజీ కుర్రాడు. ఇలా పదే పదే చేసేసరికి నిజమేనేమో అని నమ్మేసిన ఆ ముద్దుగుమ్మ ఈ కుర్రాడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకేముంది.. ప్రేమ పేరుతో చెట్టు పుట్ట రాయి రప్ప అన్ని తిరిగేశారు. మోడల్ కావడంతో ఈ పాప స్వతహాగా అందంగా ఉండటం సహజం.
 
పక్కనే ఇంత అందాన్ని పెట్టుకుని ఏదోటి చెయ్యాలన్న దుర్బుద్ధి పుట్టనే పుట్టింది ఈ యువకుడికి. అనుకున్నదే తడవుగా ఆమెని ఒక హోటల్ కి తీసుకెళ్లి ఎలాగూ ప్రేమించుకున్నాం త్వరలో పెళ్లికూడా చేసుకుంటాం.. శోభనం కాస్త అటు ఇటు అయినా పర్లేదు అని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు.తన పని పూర్తి అయ్యాక తనని పట్టించుకోవడం మానేసాడు సదరు యువకుడు. పెళ్లి చేసుకోమంటే ఊరుకునేది లేదు అంటూ బెదిరింపులకు దిగాడు. ఇక చేసేది లేక ఈ ముద్దుగుమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.