ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ అవుతున్న అడివి శేష్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

advi sesh
Updated:  2018-08-01 01:58:19

ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ అవుతున్న అడివి శేష్ సినిమా

"క్షణం" సినిమాతో మంచి థ్రిల్లర్ హీరోగా మారిన అడివి శేష్ నుంచి వస్తున్న మరో సినిమా "గూఢచారి". పూర్తి స్థాయి స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా యొక్క ట్రైలర్ ఇటివలే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ ట్రైలర్ చూడగానే అందరికి ఈ సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి. ఆగష్టు 3 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా యొక్క సెన్సార్ పనులు ఇటివలే పూర్తయ్యాయి.
 
సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ఒక్క కట్ కూడా చెప్పకుండా "యు/ఎ" సర్టిఫికేట్ ని అందించారు. తెలుగు భామ శోబిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని వారసురాలు అయిన సుప్రియ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.
 
అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వా ప్రసాద్, వివేక్ కుచిబోట్ల ఈ సినిమాని కలిసి ప్రొడ్యూస్ చేసారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మరి "క్షణం" లాగే ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది అనే ధీమా తో అడివి శేష్ అండ్ టీం ఉన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.