"గూఢచారి" సక్సెస్ డైరెక్టర్ కి దక్కద ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

gudachari
Updated:  2018-08-08 12:45:19

"గూఢచారి" సక్సెస్ డైరెక్టర్ కి దక్కద ?

"క్షణం" ఇంకా "గూఢచారి" సినిమాలతో అడివి శేష్ నటుడిగా రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్ని డైరెక్ట్ చేసిన రవికాంత్ ఇంకా శశి కిరణ్ తిక్క కి మాత్రం పెద్దగా పేరు రాలేదు. అలాగే ఈ ఇద్దరు డైరెక్టర్స్ కూడా సక్సెస్ లో అడివి శేష్ కి సక్సెస్ లో క్రెడిట్స్ ఇచ్చారు.
 
ఇక "గూఢచారి" సక్సెస్ గురించి శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ తనకు బేసిగ్గా గొడవలంటే ఇష్టముండదని. యాక్షన్ సినిమా చేయడం కూడా తనకు తెలియదని. అలాంటి తనతో "గూఢచారి" లాంటి యాక్షన్ థ్రిల్లర్ చేయించిన ఘతన అడివి శేష్ దే అని తెలిపాడు.
 
యాక్షన్ సీన్స్ ఎలా తీయాలో షాట్ మేకింగ్ ఎలాగో కూడా తనకు అస్సలు ఐడియా లేదు. "గూఢచారి" చేయడానికి ముందు అడివి శేష్ సలహాతో ఇవన్నీ నేర్చుకుని ఆ తర్వాత సినిమా తీశానన్నాడు శశి కిరణ్. ప్రస్తుతం కొన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి అని కానీ తానూ మాత్రం అడివి శేష్ తోనే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు శశి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.