హరికృష్ణ ని బాధ పెట్టిన ఆ పాత్ర ఏంటి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hari krishna
Updated:  2018-09-04 03:37:12

హరికృష్ణ ని బాధ పెట్టిన ఆ పాత్ర ఏంటి ?

వారం క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ రాజకీయాలలో ఎలా ఉన్నా సినిమా రంగం లో మాత్రం చిన్న పాత్రే అని చెప్పుకోవాలి. అయితేనేం అతను నటించిన చిత్రాలన్నీ అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్న కథానాయకుడిగా లేదంటే కుటుంబ బంధబవ్యాలకు విలువనిచ్చే పెద్దమనిషి పాత్రలే పోషించి అందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

ఆయన అతి చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. “శ్రీ కృష్ణావతారం” తో బాలనటునిగా తెరంగేట్రం చేసిన ఈయన మంచి పౌరాణిక జానపద చిత్రాల్లో నటించారు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు “దానవీరకర్ణ” చిత్రం లో అర్జునిడి పాత్ర ఆయనికి కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ ఈ పాత్ర నాకు సరైన సంతృప్తి ఇవ్వలేదని ఆయన ఒక సందర్భం లో వ్యక్తం చేశాడు.

ఆ పాత్రకి నేను నూటికి నూరు శాతం న్యాయం చెయ్యలేకపోయాను అని బాధ పడ్డారు కూడా. వాస్తవానికి ఈ పాత్రకి వేరే నటుడిని అనుకుని కొన్ని కొన్ని అనివార్య కారణాల రీత్యా హరికృష్ణ ను ఎంచుకున్నారు తారక రామరావు గారు. ఆ సినిమా నిర్మాణ పనులతో పాటు నటన కూడా చెయ్యడం వల్ల రెంటిమీద దృష్టి ఉండటం వల్ల ఇలా జరిగుండోచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.