మగధీర భామతో ఫిదా కుర్రోడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

magadheera poster
Updated:  2018-09-28 06:02:31

మగధీర భామతో ఫిదా కుర్రోడు

“మగధీర” లో హేయ్ పిల్లడు హే హే పిల్లడు అంటూ చరణ్ తో చిందులేసిన కిమ్ శర్మని అంత ఈజీగా మర్చిపోలేము. ఆమె హాట్ హాట్ అందాలు అరబోయ్యటంలో తనదోక స్టయిల్. అయితే అదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు ఈ పాపకి అవకాశాలు కరువయ్యాయి. 
 
హర్షవర్ధన్ రాణే కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అతను “ఫిదా” లో మెరిశాడు. ఇప్పుడు వీరి అఫైర్ విషయం మీడియాలో నానుతున్నది. ముంబైలో చాటుమాటుగా కలుస్తూ మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హర్షవర్ధన్, కిమ్ శర్మ శ్రీలంకలో రొమాంటిక్ టైమ్‌ను గడుపుతున్నట్టు వార్తలు మీడియాలో ఊపందుకున్నాయి. గత వారం రోజులుగా శ్రీలంకలో విహారయాత్ర చేస్తున్నట్టు ఓ బాలీవుడ్ పత్రిక తెలిపింది .సినీ కెరీర్ పీక్ లో ఉండగానే.. కెన్యా కు చెందిన పారిశ్రామిక వేత్త అలీ పుంజానీని వివాహం చేసుకొన్నది.
 
ఇద్దరికీ పడకపోవడం తో దాంపత్య జీవితం ముక్కలయింది. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా కెన్యా నుంచి ముంబైకి తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత డిజైనర్ అర్జున్ ఖన్నాతో ప్రేమలో పడింది. కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం గడిచిన తర్వాత వారిద్దరూ విడిపోయారు.ఇప్పుడు తాజాగా ఈ యుంగ్ మాన్ ని పట్టుకుని కాలం వెళ్లదీస్తుంది. ఇతనితో ఐన కలకాలం ఉంటుందో లేక శ్రీలంక నుండి రాగానే తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని కూడా  పెడుతుందో చూడాలి మరి!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.