ఆయ‌న అలాంటి వాడుకాదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-10 05:02:21

ఆయ‌న అలాంటి వాడుకాదు

బాలయ్య నటించిన 'వీరభద్ర' సినిమాలో నటించిమ తనుశ్రీ దత్తా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ యాక్టర్ నానా పాటేకర్ తనను లైంగికంగా వేదించాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది తనుశ్రీ. ఇక లీగల్ గా వెళతానంటూ నానా కూడా రియాక్ట్ అయ్యారు. ఈ విషయమై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోరు విప్పాడు. తన దర్శకత్వంలో 'భూత్' లాంటి సినిమాలలో కనిపించిన నానా కు వత్తాసు పలుకుతూ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో ని పోస్ట్ చేశాడు వర్మ. 
 
నానా పాటేకర్ కు కోపం ముక్కు మీద ఉంటుందని, ఎవరిని పట్టించుకొనట్టు కనిపించే స్వభావం ఆయనది అని చెప్పిన వర్మ నానా ఇతరుల మనసులను కావాలని నొప్పించడాని, అలాంటి పనులు అసలు చేయడని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఇక తాను అక్కడ లేకపోయినా తనుశ్రీ చెప్తోంది కాబట్టి ఆ మాటలు తను నమ్ముతానని కానీ ఇదంతా నానా కావాలని చేసి ఉండడు అని వాదిస్తున్నాడు.
 
ఇక నానా తో తన పరిచయం గురించి, అలానే ఆయన ప్రవర్తన తో షాక్ అయిన కొన్ని సంఘటనలు చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.  నిజంగా ఒకవేళ ఎవరైనా అమ్మాయి వచ్చి తనతో ఎవరో అలా ప్రవర్తించారు అని చెప్పినా నానా గుడ్డిగా మరేమీ అడగకుండా వెళ్లి అతన్ని కొట్టిపారేస్తాడాని, అలాంటిది తానే ఇలా చేస్తాడంటే నేను నమ్మను అని వీడియో ని ముగించాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.