భగవత్ గీత సాక్షిగా ఒట్టేస్తున్న సాయి ధరం తేజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 16:02:14

భగవత్ గీత సాక్షిగా ఒట్టేస్తున్న సాయి ధరం తేజ్

ఇటివలే వరుస ఫ్లాప్స్ తో డీలా పడిపోయిన సాయి ధరం తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకముందే ఇంకో కొత్త డైరెక్టర్ కథకి ఓకే చేసాడు తేజు అని తెలుస్తుంది.

కొత్త కుర్రాడు అయిన గోపాల్ చెప్పిన కథ తేజు కి బాగా నచ్చింది అంట. అందుకే త్వరగా స్క్రిప్ట్ వర్క్ ని పూర్తీ చేసుకొని షూట్ కి రెడీ అవ్వమని డైరెక్టర్ కి సలహా ఇచ్చాడు అంట సాయి ధరం తేజ్."భగవత్ గీత సాక్షిగా" అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాని మధు నిర్మించనున్నాడు.

"భగవత్ గీత సాక్షిగా" అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్ ఇంకా జనాల్లోకి ఈజీగా వెళ్ళే టైటిల్. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న తేజు కి హిట్ కంటే కూడా ఒక మంచి సినిమా రావడం ముఖ్యం. మరి అది "భగవత్ గీత సాక్షిగా" సినిమా ద్వారా తీరుతుందో లేదో చూడాలి. ఇంకా ఈ సినిమాకి ఎవరెవరు పనిచేస్తున్నారు అనే విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.