అల్లు అర్జున్ కి నిర్మాత దొరికేసాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 18:30:34

అల్లు అర్జున్ కి నిర్మాత దొరికేసాడు

అల్లు అర్జున్ నటించిన గత చిత్రం అయిన "నా పేరు సూర్య నా ఇళ్ళు ఇండియా" బాక్స్ ఆఫీస్ దగ్గ‌ర‌ బోల్తా కొట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఫ్యామిలీ తో కొంత టైం గడిపిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని విక్రం కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన పాత్రకి సంభందించిన పనుల్లో బిజీగా ఉన్నాడు అని తెలుస్తుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమా కోసం విక్రం కె కుమార్ మంచి కథని రెడీ చేసాడు.

అల్లు అర్జున్ తో ఇది వరకు "రేస్ గుర్రం" వంటి స్టైలిష్ సినిమాని తెరకెక్కించిన నల్లమల్లపు బుజ్జి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగే "సరైనోడు" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉన్న నాగ అశోక్ కుమార్ కూడా ఈ సినిమాకి మరొక ప్రొడ్యూసర్ గా ఉండనున్నాడు. ఈ సినిమాకి సంభందించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

 

షేర్ :