నాగ శౌర్య ఆ బ్యానర్ లో సినిమా చెయ్యడానికి ఇష్టపడట్లేదు అట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:36:59

నాగ శౌర్య ఆ బ్యానర్ లో సినిమా చెయ్యడానికి ఇష్టపడట్లేదు అట

యంగ్ హీరో అయిన నాగ శౌర్య ఇటివలే "ఛలో" సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాని నాగ శౌర్య కి నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం "ఊహలు గుస గుసలాడే". నాగ శౌర్య కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా గాని "ఊహలు గుస గుసలాడే" సినిమా మాత్రం స్పెషల్ గా నిలిచిపోతుంది.

అయితే నాగ శౌర్యతో అలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన సాయి కొర్రపాటి తో ఒక సినిమా చెయ్యడానికి నో చెప్పాడు అంట నాగ శౌర్య. అసలు నాగ శౌర్య సాయి కోర్రపాటికి నో ఎందుకు చెప్పాడు అనేది కూడా ఎవ్వరికి తెలియదు.

కాని నాగ శౌర్య మాత్రం వారాహి బ్యానర్ లో "జ్యో అచ్యుతానంద" "దిక్కులు చూడకు రామయ్య" వంటి మంచి సినిమాల్ని చేసాడు. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు గాని వారాహి బ్యానర్ ని దూరం పెట్టడం స్టార్ట్ చేసాడు శౌర్య. సాయి కొర్రపాటి మాత్రం నాగ శౌర్య తో ఎలాగైనా సినిమా చెయ్యాలి అనే ఆలోచలనో ఉన్నాడు. ఇదిలా ఉంటే నాగ శౌర్య ప్రస్తుతం "నర్తనశాల" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.