నేచ‌ర‌ల్ స్టార్ నానీ బ‌ర్త్ డే స్పెష‌ల్ స్టోరీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero-nani
Updated:  2018-02-24 11:29:26

నేచ‌ర‌ల్ స్టార్ నానీ బ‌ర్త్ డే స్పెష‌ల్ స్టోరీ

నేచ‌ర‌ల్    స్టార్ నాని అంటే తెలియ‌ని వారు ఉండ‌రు... అత‌ని సినిమా ఎప్పుడు విడుద‌ల అయినా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ వ‌ర్షం కురిపిస్తుంటాడు నాని..  తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అష్టాచ‌మ్మా సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైన నేచుర‌ల్ స్టార్ నాని త‌న సినిమాల ప‌రంప‌ర అప్ప‌టి నుంచి కొన‌సాగిస్తూనే  ఉన్నాడు... ఈ చిత్రంలో న‌టించి త‌న‌కంటూ  ఓ ప్ర‌త్యేక ఫేమ్ తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.... అయితే ప్ర‌స్తుతం నాని వ‌రుస సినిమా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ, త‌న సినీ కెరియ‌ర్ లో దూసుకుపోతున్నాడు.
 
నాని  ఫిబ్రవరి 24, 1981 లో జ‌న్మించాడు.. తాను పుట్టింది కృష్ణా జిల్లా అయినా, చిన్న త‌నంలోనే  త‌ల్లిదండ్రులు హైద‌రాబాద్ లో స్థిర‌డ్డారు.. నానికి చిన్న‌తనం నుంచి  చ‌దువు పెద్ద‌గా అబ్బేది కాదట‌... దీంతో  నాని త‌ల్లి దండ్రులు అత‌ను పెద్ద‌య్యాక ఏమైపోతాడో అని మ‌ద‌న ప‌డేవార‌ట‌... దీంతో చివ‌రికి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి, నాని కి ఏది ఇష్ట‌మైతే అది చేయ‌మ‌ని చెప్పార‌ట‌.
 
డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యంలో  నానికి డైరెక్ట‌ర్ అవ్వాల‌నే కోరిక ఉండేద‌ట‌... డైరెక్ట‌ర్ అవ్వ‌డం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు నానీ....  ఫిలిమ్  ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాక‌ముందు అస‌లు పేరు నాని కాదట‌, అత‌న్నినవీన్ బాబు ఘంటా అని పిలిచేవార‌ట అంద‌రూ ... కాని తాను  చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాక నానిగా మార్చుకున్నాడ‌ట‌.
 
అయితే చివ‌రిగా శ్రీను వైట్ల నుంచి నానికి క‌బురురావ‌డంతో అత‌ని ద‌గ్గ‌ర స‌హద‌ర్శ‌కుడిగా 2004 లో కొంత కాలం పాటు  ప‌నిచేశాడు నాని ... ఆ త‌ర్వాత  హైదరాబాద్ లో కొన్ని రోజుల పాటు రేడియో జాకీగా కూడా పనిచేసాడు..అలా  క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తూ, ఇండ‌స్ట్రీలో జ‌రిగే అన్ని విష‌యాల‌న్ని తెలుసుకున్నాడు నాని... ఆ స‌మ‌యంలో త‌న‌కు హీరో అవ్వాల‌నే కోరిక పుట్టింద‌ట‌... అయితే త‌న కోరిక ప్ర‌కార‌మే హీరో అయ్యే అవ‌కాశం వ‌చ్చింద‌ట నానికి... కాని  ఆ స‌మ‌యంలో త‌న‌కు హీరో అవ్వాల‌నే ఆశ ఉన్నా? ఇష్టం లేని స‌మయంలో అనుకోని విధంగా అష్టాచ‌మ్మా సినిమాలో హీరోగా న‌టించాడ‌ట నాని...  త‌న‌కు ఇష్టం లేకున్నా ఈ సినిమా మంచి హిట్ అవ్వ‌డంతో నానికి ఎన‌లేని క్రేజ్ వ‌చ్చింది.. ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో త‌ర్వాత  ఎన్నో సినిమాల‌లో హీరోగా న‌టించే అవ‌కాశాల‌ను ద‌క్కించుకున్నాడు నేచ‌ర‌ల్ స్టార్ నాని.
 
అయితే మ‌రో విష‌యం ఏమిటంటే?  నాచుర‌ల్ స్టార్ పేరు కూడా నానికు బ‌ల‌వంతంగా వ‌చ్చింది కాద‌ట‌... అలా అని చిత్ర ప‌రిశ్ర‌మ కూడా ప్ర‌క‌టించ‌లేద‌ట‌... ఇది కేవ‌లం   వెబ్ సైట్ ల‌లో, అభిమానులు మాత్ర‌మే ప్ర‌క‌టించిన పేర‌ట‌... కానీ ఈ పేరు  నానికి వ్య‌క్తి గ‌తంగా చాలా ఇబ్బంది పెట్టింద‌ట‌... అదే స‌మ‌యంలో డైరెక్ట‌ర్ మారుతీ తెర‌కెక్కించిన చిత్రం భ‌లే భ‌లే మ‌గాడి ఓయ్  సినిమాలో  స్క్రీన్ పై నాచుర‌ల్ స్టార్ అని పేరు పెడ‌తాన‌ని డైర‌క్ట‌ర్ మారుతి నానిని కోరార‌ట‌. అయితే దీనికి నాని నో అన్నాడ‌ట‌.. అయినా మారుతి నేచుర‌ల్ స్టార్ అనే పేరు స్క్రీన్ పై వేయించార‌ట‌..
 
నిజంగా టాలీవుడ్ లో అతి త‌క్కువ కాలంలో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న హీరోగా నాని రికార్డు సృష్టించాడు వ‌రుస‌గా ఏడు సినిమాలు హిట్ ట్రాక్ లోకి వెళ్లిన యంగ్ టాలీవుడ్ హీరో కూడా నానినే.. నేచ‌ర్ లో నేచుర‌ల్ స్టార్ గా ఉన్న నానికి 
హ్యాపీ బ‌ర్త్ డే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.