ట్రోల్స్ ని భరించలేకపోయా.. నాని

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nani hero
Updated:  2018-10-06 11:11:33

ట్రోల్స్ ని భరించలేకపోయా.. నాని

న్యాచురల్ స్టార్ నాని ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు... ఇది ఒకప్పటి మాట. బిగ్ బాస్ షో పుణ్యమా అని కొందరు ఇష్టపడని వాళ్ళని కూడగట్టుకున్నాడు నాని. సినిమాలు ప్లాప్ అయినప్పుడు కూడా ఎప్పుడూ నాని ని ట్రోల్ చేసింది లేదు.. అలాంటిది ఒక షో వల్ల భయాంకరమైన నెగిటివ్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.. షో మొదట్నుండి ఏదొక వివాదం , మొదట్లో జూ.ఎన్టీఆర్ చేసిన షో కి నాని నా అని, ఆ తరువాత తారక్ అంత మెప్పించట్లేదు అని, తరువాత ఈ షో కి టి.ఆర్.పి రావట్లేదు అని ఇలా రకరకాల విమర్శలు  నాని ఎదుర్కొన్నాడు..

బుల్లితెర మీద వెలిగిన తారలు జూ.ఎన్టీఆర్, నాగార్జున,చిరంజీవి వీళ్లంతా టి.వి షో ల వల్ల మరింత ప్రజలకి,ప్రేక్షకులకు దగ్గర అయితే, నాని మాత్రం ఒక వర్గం వారి వ్యతిరేకత ని చవిచూస్తున్నాడు ప్రస్తుతం. షో మధ్యలో కౌశల్ పేరిట ఏర్పడిన కౌశల్ ఆర్మీ, నాని ని ముప్పుతిప్పలు పెట్టింది. ఏ మాత్రం కౌశల్ ని కార్నర్ చేసినట్టు కనిపించిన నాని ని తిడుతూ ట్వీట్స్ తో ట్రెండ్ చేసేవారు.. ఇక బిగ్ బాస్-2 కంప్లీట్ అయ్యాక తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు నాని.

ఆ ఇంటర్వ్యూలో ఇక హోస్ట్ గా బిగ్ బాస్ కు రానని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా "ఇప్పటివరకు మీ ప్రేమ, అభిమానాన్ని చూసిన నేను, మీ వ్యతిరేకత ని భరించలేకపోతున్నాను. నేను అసలే సెన్సిటివ్ అందుకే అంత నెగిటివిటి ని హ్యాండిల్ చెయ్యలేకపోయా " అంటూ అభిమానులకి చెప్పకనే చెప్పాడు నాని..కంటిన్యూగా తనపై విమర్శలు.. ట్రోల్స్ లాంటివి భరించడం తనకు శక్తికి మించిన పనైందని అన్నాడు.. చివరిగా బిగ్ బాస్ తనకో పాఠం అని, తను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో మరో సారి తనకు తెలిసిందని అన్నాడు నాని..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.