పెళ్ళంటే నో అంటున్న నితిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero nithin
Updated:  2018-07-17 01:46:10

పెళ్ళంటే నో అంటున్న నితిన్

యంగ్ హీరో అయిన నితిన్ ప్రస్తుతం "శ్రీనివాస కళ్యాణం" అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్లి యొక్క గొప్పతనం ప్రతి ఒక్క లైఫ్ లో పెళ్లి అనేది ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే పెళ్లి పట్ల నేటి యువత కి ఉన్న ఫీలింగ్స్ ఏంటి ఇవన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు నితిన్. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తీ స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
 
దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ఇదిలా ఉంటే నితిన్ తన తదుపరి సినిమాని వెంకి కుడుముల దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నితిన్ పెళ్లి అంటే ఆమడ దూరంలో ఉండే వ్యక్తిగా కనిపించనున్నాడు అంట. పెళ్లిపై వెంకీ ఫుల్ సెటైరిక‌ల్ గా ఈ చిత్రం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.
 
మరి ఒక వైపు ఒక సినిమాలో పెళ్లి గొప్పతనం గురించి చెప్తూనే మరో సినిమాలో పెళ్ళంటేనే వేస్ట్ అని భోధనచేయబోతున్నాడు నితిన్. నితిన్ కి ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కీలకమే. ఒక సినిమా ఆగష్టు లో విడుదలవుతుండగా ఇంకో సినిమా ఆగష్టు మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.