తన పెళ్లి పై నోరు విప్పిన నితిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nithin hero
Updated:  2018-07-23 03:54:42

తన పెళ్లి పై నోరు విప్పిన నితిన్

మన తెలుగు ఇండస్ట్రీ లో పెళ్లి కాకుండా ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు, వారిలో మనకి ముందుగా గుర్తొచ్చే పేర్లు ప్రభాస్, శర్వానంద్, రామ్, నితిన్. అయితే ఈ నలుగురి హీరోల్లో నితిన్ మాత్రం తన పెళ్లి గురించి ఒక న్యూస్ బయట పెట్టాడు. 35 ఏళ్ళకి వచ్చిన నితిన్ కు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక తోడు కావలి అనిపిస్తుంది అట.

తన లేటెస్ట్ సినిమా అయిన "శ్రీనివాస కళ్యాణం" సినిమాలో నితిన్ పెళ్లి కొడుకుగా నటించాడు. ఇటివలే జరిగిన ఈ సినిమా యొక్క ఆడియో రిలీజ్ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ, ఇక తాను పెళ్ళికి సిద్ధం అని చెప్పాడు. దర్శకుడు సతీష్ వేగేశ్న వచ్చి కథ చెప్పినప్పుడే నాకు పెళ్లి మీద మనసు కలిగింది అని.

ఇక సినిమా మొత్తం పూర్తయిన తర్వాత మమ్మీ నేను ఇక పెళ్లి చేసుకుంటానని మా అమ్మతో చెప్పాను అని అన్నాడు నితిన్. నితిన్ పై ఇండస్ట్రీ లో రూమర్స్ తక్కువే పైగా ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తోని రేలషన్ లో కూడా లేడు. సో ఇక ఈ మాట విన్న నితిన్ తల్లి ఇప్పుడు నితిన్ కోసం మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉంది అంట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.