ఆగస్ట్ నుంచి ప్రభాస్ కొత్త సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas hero
Updated:  2018-07-23 12:26:10

ఆగస్ట్ నుంచి ప్రభాస్ కొత్త సినిమా

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తరువాత "సాహో" సినిమా చేస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుండ్. అయితే గత ఏడాది నుంచి ఈ సినిమా యొక్క షూటింగ్ సాగుతుంది.
 
ఇటివలే మూవీ యూనిట్ దుబాయ్ లో షూటింగ్ పూర్తీ చేసుకొని హైదరబాద్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తీ కాకముందే ప్రభాస్ తన తదుపరి మూవీ ని సెట్స్ పైకి తిసుకేల్తున్నాడు. "జిల్" ఫేం రాధా కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ని దర్శకుడు రొమాంటిక్ డ్రామా గా రూపొందిస్తున్నారు.
 
ఈ సినిమా ని ఆగష్టు మొదటి వారం లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ సినిమా లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుంది. ఈ సినిమా సింహ భాగం మొత్తం యూరోప్ లో జరగనుంది. "సాహో" సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్న యువి క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.