గుండు గియించుకున్న రాజ్ తరుణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

raj tharun hero
Updated:  2018-07-23 13:43:11

గుండు గియించుకున్న రాజ్ తరుణ్

హీరో రాజ్ తరుణ్ కి గత కొంత కాలంగా ఫ్లాప్స్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇటివలే రాజ్ తరుణ్ హీరోగా చేసిన "లవర్" సినిమా రిలీజ్ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయగా అనీష్ కృష్ణ ఈ మూవీ ని డైరెక్ట్ చేసాడు.

ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ పెద్ద హిట్ ని ఎం తేలేకపోయింది. అయినా సరి మూవీ తప్పకుండా హిట్ అవ్వాలి అనే కసితో తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామికి మొక్కి తలనీలాలు సమర్పించాడు రాజ్ తరుణ్. అయితే గుండు చేయించుకున్న రాజ్ తరుణ్ ని అక్కడ జనాలు ఎవరు గుర్తుపట్టలేదు.

కానీ పక్కన హీరోయిన్ రిద్ది కుమార్ ఉండే సరికి అందరూ రాజ్ తరుణ్ ని గుర్తుపట్టేసారు. రాజ్ తరుణ్ ఆ గుండుతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన కూడా అభిమానులతో ఫోటోలు దిగాడు. మరి రాజ్ తరుణ్ ఈ టైం లో గుండు చేయించుకున్నాడు అంటే ప్రస్తుతానికి సినిమాలు ఏవి లేవనే అర్ధం అని ఫిలిం నగర్ జనాలు అంటున్నారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.