బడ్జెట్ తగ్గించుకో అని బోయపాటికి చెప్పిన రామ్ చరణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ram charan and boyapati srinu
Updated:  2018-07-11 06:02:55

బడ్జెట్ తగ్గించుకో అని బోయపాటికి చెప్పిన రామ్ చరణ్

మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు చెప్తేనే అందరికి భారీ యాక్షన్ సన్నివేశాలు గుర్తొస్తాయి, అలాగే భారీ జనం తో మంచి మంచి ఎలివేషన్ సీన్స్ కూడా గుర్తొస్తాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
 
ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను భారీగా ఖర్చు చేయడం ప్రారంభించాడని తెలుస్తుంది. కేవలం విలన్ ఎంట్రీ సీన్ అయిన బహిరంగ సభకు కోట్లు ఖర్చు చేయించారని టాక్. అయితే ఈ మద్య చాలా మంది స్టార్ హీరోలు సాద్యమైనంత వరకు బడ్జెట్ విషయంలో నిర్మాతలను సేవ్ చేయాలని చూస్తున్నారు. కొంత మంది అయితే రెమ్యూనరేష తగ్గించుకొని మరి నిర్మాతలని కాపాడుతున్నారు
 
.అయితే ఈ సినిమాకి భారీ గా ఖర్చు పెరుగుతుంది అని భావించిన రామ్ చరణ్ అనుకున్న బడ్జెట్ కన్నా పది కోట్లు కచ్చితంగా తగ్గాలని క్లియర్ గా డైరక్టర్ బోయపాటికి చెప్పాడట. బోయపాటి లాస్ట్ సినిమా "జయజానకీ నాయక" సినిమాకు నలభై కోట్లకు పైగా ఖర్చు అయ్యింది, అందుకే ఆ సినిమా లాస్ లోకి వెళ్ళిపోయింది అని ట్రేడ్ పండితుల అభిప్రాయం. మరి రామ్ చరణ్ సినిమాతో అయిన ప్రొడ్యూసర్ ని లాభాల్లోకి నేట్టేస్తాడో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.