మ‌హేష్ కూతురిని ఆట‌ప‌ట్టించిన రామ్ చ‌ర‌ణ్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram charan and sitara
Updated:  2018-07-21 01:20:37

మ‌హేష్ కూతురిని ఆట‌ప‌ట్టించిన రామ్ చ‌ర‌ణ్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కి మధ్య ఎంత అనుభందం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తెలుగు లో స్టార్ హీరోస్ ఏ అయిన గాని బయట మాత్రం తరచూ కలుస్తూనే ఉంటారు. అయితే ఇటివలే మహేష్ బాబు కూతురు సితార పుట్టిన రోజు సంధర్బంగా సితారకి చాలా ఫన్నీ వే లో విశేష్ తెలియజేసాడు.
 
మీ నాన్న పాటలే కాదు అప్పుడప్పుడు నా పాటలు కూడా విను సితార అనుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు రామ్ చరణ్. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు కూడా అదే రోజు కావడం విశేషం. అలాగే చెర్రీ భార్య ఉపాసన, మహేష్‌ వైఫ్‌ నమ్రతా శిరోద్కర్‌ కూడా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. వీరు తరచుగా బయట కలుస్తుంటారు. ఫ్యామిలీ టూర్‌లకు కూడా వెళ్తుంటారు.
 
అక్కడ దిగిన ఫొటోలను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఉపాసన పోస్టు చేస్తూ ఉంటారు. ఇలా ఉపాసన, రామ్ చరణ్‌కు మహేశ్ బాబు కూతురు సితార కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలు ఇలా హాయిగా కలిసి ఫ్రెండ్స్ లాగ ఉండటం అనేది చాలా బాగుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.