ఎన్టీఆర్ కి పోటీగా వస్తున్న రామ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ram pothineni and hero jr ntr
Updated:  2018-07-11 04:58:28

ఎన్టీఆర్ కి పోటీగా వస్తున్న రామ్

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం "హలో గురు ప్రేమకోసమే" అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగం కి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. రామ్ సరసన "ప్రేమం" బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఇంకో హీరోయిన్ గా ప్రనిత సుబాష్ నటిస్తుండగా ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ ఇంకా రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు హై లైట్ కానున్నాయి అని మూవీ యూనిట్ అంచనా. ఇదిలా ఉంటే త్వరలో అన్ని పనులు పూర్తీ చేసుకొని అక్టోబర్ 18 న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.

ఈ విషయాన్నీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే అదే రోజు దసరాకి ఎన్టీఆర్ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న "అరవింద సమేత" కూడా రిలీజ్ కానుంది. మొత్తానికి ఒక స్టార్ హీరోకి పోటీగా తన సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు రామ్. మరి ఈ దసరా వార్ లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.