ఆ సినిమాని ఆపేసిన రవితేజ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ravi teja
Updated:  2018-07-20 03:51:48

ఆ సినిమాని ఆపేసిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం సిర్ను వైట్ల దర్శకత్వంలో వస్తున్నా "అమర్ అక్బర్ అంటోనీ" సినిమాతో బిజీగా ఉన్నాడు. అను ఎమన్యుఎల్ ఇంకా ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
 
అయితే ఈ సినిమా తరువాత రవితేజ, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో "తేరి" రీమేక్ సినిమాని స్టార్ట్ చేస్తాడు అని వార్తలు వచ్చాయి. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా త్వరలో పూజ కార్యక్రమాలతో స్టార్ట్ అవ్వల్సింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. రవితేజ ఈ రీమేక్ చేయడానికి ఇష్టపడట్లేదు అని టాక్.
 
ఈ సినిమా ని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయనున్నారు. అసలైతే ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నారు కాని ఆయన రాజాకీయాల్లో బిజీగా ఉండటం వాళ్ళ ఆ సినిమా రవితేజ కి వచ్చింది. కానీ ఇప్పుడు రవితేజ కూడా ఈ సినిమా చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నాడు అని టాక్. మరి ఈ న్యూస్ పై ప్రొడ్యూసర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.