హిట్టు కోసం అమెరికా వెళ్ళిన సాయి ధరం తేజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai dharam tej hero
Updated:  2018-07-17 11:44:01

హిట్టు కోసం అమెరికా వెళ్ళిన సాయి ధరం తేజ్

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం తన కెరీర్ లో బ్యాడ్ ఫేస్ లో ఉన్నాడు. వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న తేజ్ కి ఇప్పుడు ఒక మంచి హిట్ అవసరం. రాను రాను మార్కెట్ లో కూడా సాయి ధరం తేజ్ వాల్యూ తగ్గిపోతుంది.
 
ఇదంతా దృష్టి లో పెట్టుకొని మెగా స్టార్ చిరంజీవి సహాయంతో మల్లి హిట్టు కొట్టే పనిలో బిజీగా ఉన్నాడు సాయి ధరం తేజ్. ఇప్పట్నుంచి కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని తేజ్ డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది.
 
"నేను శైలజ" ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో మాత్రమే నటిస్తున్నాడు తేజ్. అయితే ఈ సినిమాలోని లుక్ కోసం తేజు అమెరికా వెళ్ళాడు అంట. అమెరికా లో కొంత మంది స్టైలిష్ టెక్నీషియన్స్ ఆద్వర్యం లో  కొత్త మేకోవర్ తో ఇండియాకి తిరిగి వస్తాడు అంట తేజ్. ఈ సినిమాకి "చిత్రలహరి" అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.