స‌క్సెస్‌పై న‌మ్మ‌కం లేని టాప్ హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 14:57:59

స‌క్సెస్‌పై న‌మ్మ‌కం లేని టాప్ హీరో

మెగా సుప్రీమ్ హీరో అయిన సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా "తేజ్ ఐ లవ్ యు". ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బీలో ఆవరేజ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ మూవీ టాక్ విషయం తేజు కి ముందుగానే తెలిసినట్టు ఉంది.
 
ఎందుకంటే ఇటివలే ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా వచ్చిన తేజ్ చాలా డల్ గా నీరసంగా అనిపించాడు అని కొంత మంది అంటున్నారు. ఏదో వేరే హీరో సినిమా ఇంటర్వ్యూస్ కి వచ్చాను అనే ఫీలింగ్ తో తేజ్ మీడియా మిత్రులతో మాట్లాడు అని అంటున్నారు.
 
ఏది ఏమైనా గాని గత కొంత కాలంగా ఫ్లాప్స్ తో కొట్టు మిట్టడుతున్న సాయి ధరం తేజ్ ఈ "తేజ్"తో కూడా సరైన హిట్ ని అందుకోలేకపోయాడు అని చెప్పొచ్చు. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే తేజు ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అయిన తేజు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సక్సెస్ వస్తుందో లేదో చూడాలి. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.