మోడీ పై వ్యాఖ్యలు చేసిన హీరో సిద్దార్ధ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pm modi and hero siddardh
Updated:  2018-10-31 06:06:02

మోడీ పై వ్యాఖ్యలు చేసిన హీరో సిద్దార్ధ్

హీరో సిద్దార్ధ్ అంటే ఒకప్పుడు ఫ్యామిలీ అండ్ యూత్ హీరో .. యూత్ కి దగ్గరయ్యే రోల్స్ చేస్తూ, మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు. కానీ ప్రస్తుతం సిద్దార్ధ్ అంటే ఒక వివాదాస్పద నటుడు. నిత్యం ఏదొక వివాదం లో ఉంటున్నాడు ఈ హీరో. తాజాగా సోషల్ మీడియాలో సిద్దార్ధ్ పెట్టిన ట్వీట్ కి, నెటిజన్లు దగ్గర నుండి వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి.

ఆ ట్వీట్ కూడా పొలిటికల్ గా పెట్టాడు ఈ హీరో. ఇంతకీ ఆ ట్వీట్ లో ఉన్నది ఏంటంటే..? సర్దార్ వల్లభాయ్ పటేల్ 143 వ జన్మదిన సందర్భంగా ప్రధాని మోడీ నర్మద నది తీరంలో ప్రపంచంలో అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ సర్దార్ విగ్రహానికి 3000 వేల కోట్లు ఖర్చు అయినట్టు తెలిసిందే. అయితే దాన్నీ టార్గెట్ చేస్తూ సిద్దార్ద్ కామెంట్స్ చేసాడు.

ఇదంతా కేవలం ఎలెక్షన్స్ జిమ్మిక్కుగా అభివర్ణించాడు. అంతే కాకుండా ఈ విగ్రహానికి పెట్టిన డబ్బు కి రైతులు అర్హులు అని పోస్ట్ చేసాడు సిద్దార్ధ్. అయితే నెటిజన్లు దీని పై వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.. మీరు సినిమాలు మానేసి రైతులకు ఇవ్వండి, నువ్వు మారవా అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు.. ఏదైతేనేం చేతిలో సినిమాలు లేనప్పుడు ఏదోలా పబ్లిక్ దృష్టిలో పడాలి కదా అంటున్నారు కొంత మంది.

షేర్ :