శింబు ఆమెని నిజంగానే వేధించాడా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

simbu hero
Updated:  2018-10-23 11:28:08

శింబు ఆమెని నిజంగానే వేధించాడా..?

ఎక్కడో ఇతర దేశాల్లో మొదలై, భారతీయ చిత్ర మరియు రాజకీయాల్లో సంచలనాలకి తెర లేపుతున్న ఉద్యమం మీ టూ. బాలీవుడ్ లో కొందరు నటీమణులు దర్శక నిర్మాతలు తో ఆగకుండా, రాజకీయ నాయకులపై ఆరోపణలు లు చేశారు. ఈ ఉద్యమం ఇప్పుడు ఉత్తర భారత దేశం నుండి, దక్షిణ భారతదేశంలో కూడా దుమారం రేపుతోంది..మొదట గాయనీ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అందరికి తెల్సిన చిన్మయి మీటూ అంటూ వైరముత్తు మరియు మరికొందరిపై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత సౌత్ స్టార్ హీరో అర్జున్ పై హీరోయిన్ శృతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది.తాజాగా తమిళ స్టార్ హీరో శింబు కూడా లైంగిక వేదింపులకు పాల్పడ్డాడా అనే విషయం పై కోలీవుడ్ లో చర్చ జరుగుతుంది.విషయానికి వస్తే తమిళ హీరోయిన్ లేఖ వాషింగ్టన్ ట్విట్టర్ లో మీటూ హ్యాష్ ట్యాగ్ తో కెట్టవన్ అంటూ ట్వీట్ చేసింది. కెట్టవన్ అనేది శింబు నటించిన సినిమా . అందుకే  అందరి దృష్టి శింబుపైకి మళ్లింది. లేఖ కెట్టవన్ అంటూ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆమెను శింబు లైంగికంగా వేదించాడేమో అని - అందుకే ఆమె సినిమా పేరుతో ట్వీట్ చేసి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లేఖ ట్వీట్ పై చర్చ జరుగుతున్న సమయంలో శింబు ఆఫీస్ నుండి వెంటనే ఒక ప్రకటన బైటకొచ్చింది. కెట్టవన్ చిత్రం షూటింగ్ సమయంలో ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని,ఆమె ఎందుకు ఆ సినిమా పేరుతో ట్వీట్ చేసిందో తెలియదని, ఆమె క్లారిటీ ఇవ్వకుండా శింబు పేరుతో తప్పుడు వార్తలు రాయడం మంచి పద్దతి కాదు అంటూ వారు ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అయినా కూడా శింబుకు ఉన్న స్టార్ ఇమేజ్ నేపథ్యంలో ఆమెను శింబు వేధించే ఉంటాడు అంటూ కొందరు గుసగుసలు ఆడుకుంటున్నారు.. కెట్టవన్ షూటింగ్ సమయంలో శింబు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడా, లేక  ఆ సినిమా