రాజ‌కీయం పై క్లారీటి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero-srikanth
Updated:  2018-02-24 12:06:07

రాజ‌కీయం పై క్లారీటి

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ఫేమ్ తెచ్చుకున్నారు హీరో శ్రీకాంత్... ఇండ‌స్ట్రీకి మొద‌ట్లో విల‌న్ పాత్ర‌తో అడుగు పెట్టి నెమ్మ‌దిగా హీరో అయ్యాడు... 1995 లో ముప్ప‌నేల‌ని శివ తెర‌కెక్కించిన చిత్రం తాజ్ మ‌హ‌ల్... ఈ చిత్రానికి శ్రీకాంత్ మొద‌టిసారి హీరోగా న‌టించారు... మౌనికా బేటీ  శ్రీకాంత్ స‌ర‌స‌న న‌టించారు.. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో హీరోగా మంచి ఆద‌ర‌ణ పొందాడు శ్రీకాంత్... ఆ త‌ర్వాత ఖ‌డ్గం, ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, పెళ్లి సంద‌డి వంటి చిత్రాల‌లో న‌టించారు.. కొంత కాలం పాటు చిర‌స్థాయి హీరోగా నిలిచారు శ్రీకాంత్ .
 
అయితే తాజాగా ఈయ‌న రాజ‌కీయ ప్ర‌స్తావ‌న వెలుగుచూసింది...  చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి ఇప్ప‌టికే అనేక మంది రాజ‌కీయ అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే... తాజాగా హీరో శ్రీకాంత్ త‌న రాజ‌కీయ అరంగేట్రంపై ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...తాను ఎట్టి ప‌రిస్థితిలో రాజ‌కీయాల్లోకి వెళ్ల‌న‌ని, త‌న‌కు జీవితాన్ని ఇచ్చిన‌ ఫిలిం ఇండ‌స్ట్రీని వ‌దిలి ఎక్క‌డికి వెళ్ల‌న‌ని స్ప‌ష్టం చేశారు... అందులో భాగంగానే త‌న స‌హాన‌టుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి పార్టీ పిలుపు  వ‌చ్చినా, తాను రాజ‌కీయాల్లోకి వెళ్ల‌న‌ని, అలాగే త‌న‌కు వాటిపై ఎలాంటి అవ‌గాహన  లేద‌ని శ్రీకాంత్ వెల్ల‌డించారు... అయితే, ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎవరు వెళ్లినా సక్సెస్ కావాలని మాత్రం కోరుకుంటాను తప్ప, తాను మాత్రం వాటి జోలికి వెళ్లనని, వాటిలో ఇమడలేనని శ్రీకాంత్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.