సుధీర్ బాబు వారితో గొడవ పెట్టుకున్నాడా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sudheer babu
Updated:  2018-10-17 12:59:51

సుధీర్ బాబు వారితో గొడవ పెట్టుకున్నాడా ?

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ శరణ్ నలుగురూ కలిసి ఒక మల్టీస్టార్రర్ సినిమా వీర భోగ వసంత రాయలు సినిమా లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక వైభవంగా జరిగింది. అయితే, అందరూ వచ్చారు కానీ సుధీర్ బాబు మాత్రం రాలేదు. ఇటు చూస్తే ఏమో ట్రైలర్ లో సుధీర్ బాబు కి వేరెవరో డబ్బింగ్ చెప్పడం అది సుధీర్ కి అసలు సెట్ అవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది అనేది చర్చనీయాంశంగా మారింది.

కొందరు సుధీర్ గొంతు పాడైంది ఏమో అంటుంటే మరి కొందరేమో ఏదో మతలబు ఉంది అంటూ చెబుతున్నారు. వీళ్ళ అనుమానానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు సుధీర్ బాబు వీరభోగ వసంత రాయలు ట్రైలర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేయలేదు కానీ బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ ను అభినందిస్తూ పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని కొంతమంది ఫాలోయర్లు సుధీర్ బాబు ను అడిగారు. వారికి "ట్వీట్ లో వివరించలేని చాలా కారణాల వల్ల నేను వీరభోగ వసంతరాయలు లో నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేకపోయాను. 

అవును.. అది నా వాయిస్ కాదు అంటూ సమాధానమిచ్చాడు. ఇక దీని గురించి కొందరు ఇగో ఇష్యూస్ వల్లనే అంటూ ఆరోపిస్తుంటే, మరి కొందరు క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా కారణం అయ్యి ఉండచ్చు అంటూ వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రోమోషన్ల సమయంలో ఈ ప్రశ్న సుధీర్ కి అలాగే చిత్రబృందానికి ఎదురయ్యేదే. దానికి వారు సమాధానం. ఇవ్వాల్సిందే. చూద్దాం ఏం చెప్తారో.

షేర్ :

Comments

0 Comment