"ఎన్టీఆర్" లో ఏఎన్ఆర్ ఫిక్స్‌ అయ్యాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr bio pic
Updated:  2018-08-06 11:56:09

"ఎన్టీఆర్" లో ఏఎన్ఆర్ ఫిక్స్‌ అయ్యాడు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారకరామారావు జీవిత కథగా తెరెకెక్కుతున్న నచిత్రం "ఎన్టీఆర్ .జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇక బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ  సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అక్కినేని నాగచైతన్య కనిపించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
 
అయితే ఈ పాత్రలో నటుడు సుమంత్‌ సందడి చేయనున్నారట. ఇదే విషయాన్నీ సుమంత్  తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. ఎన్టీఆర్‌ బృందంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో మా తాతయ్య ఏయన్నార్‌ పాత్రను పోషిస్తున్నా..ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు.
 
క ఈ చిత్రంలో  కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. అయితే, యంగ్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ, కృష్ణగా మహేశ్‌బాబు, సావిత్రిగా కీర్తి సురేశ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రామానాయుడుగా వెంకటేశ్‌ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.