ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 16:01:49

ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్ సినిమా

మెగా ప్రిన్స్ అయిన వరుణ్ తేజ్ ఈ ఏడాది "తొలిప్రేమ" సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తరువాత వరుణ్ తేజ "ఘాజీ" ఫేం అయిన సంకల్ప్ రెడ్డి తో కలిసి ఒక స్పేస్ ఫిలిం స్టార్ట్ చేసాడు.
 
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పై క్రిష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అదితి రావు హైదరి ఇంకా లావణ్య త్రిపాటి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూర్తి స్థాయి స్పేస్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది.
 
మరి షూటింగ్ సమయంలోనే ఎన్నో అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ మూవీ కి "వ్యామగామి" అనే టైటిల్ ప్రచారం లో ఉంది. మరి వరుస సక్సెస్ తో దూసుకెళ్తున్న మెగా హీరోకి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.