తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టబోతున్న వరుణ్ తేజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 18:30:10

తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టబోతున్న వరుణ్ తేజ్

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోలు తెలంగాణ మాట్లాడటం అనేది మామూలు విషయం అయిపొయింది. దర్శకుడు కూడా ప్రతి హీరో క్యారెక్టర్ కి తెలంగాణా స్లాంగ్ జోడిస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా హీరో అయిన వరుణ్ తేజ్ కూడా తన తదుపరి సినిమా కోసం తెలంగాణా బాష మాట్లాడబోతున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా రూపొందుతుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రానికి "ఎఫ్ 2" టైటిల్ తో పాటు ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ అనే ట్యాగ్ లైన్‌ ని  ఫిక్స్ చేసారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో చాలా బిజీ గా వున్నారు. ఈ మొదటి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 21 వరకు కొనసాగబోతుంది. తమన్నా ఇంకా మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

షేర్ :