పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో వెంకటేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero venkatesh
Updated:  2018-07-11 12:55:45

పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో వెంకటేష్

విక్టరీ వెంకటేష్ గత ఏడాది కేవలం "గురు" అనే ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ చేసాడు, కాని ఈ ఏడాది మాత్రం వరుస మూవీస్ తో బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో "ఎఫ్" అనే మూవీ లో నటిస్తున్న వెంకటేష్ ఆ తరువాత బాబీ దర్శకత్వం లో నాగ చైతన్య తో కలిసి ఒక మూవీ లో నటించబోతున్నాడు.

అయితే ఈ సినిమా తరువాత వెంకటేష్ ఒక మూవీ లో నటించబోతున్నాడు అంట, ఈ చిత్రంతో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు వెంకటేష్. "ఘర్షణ" "సూర్య ఐపీఎస్" "ఈనాడు" వంటి సినిమాలలో ఇప్పటికే పోలీస్ పాత్రలో కనిపించిన వెంకటేష్ మళ్ళీ అదే పాత్రలో నటించబోతున్నాడు.

ఇటీవలే "నేను లోకల్" సినిమా దర్శకుడు అయిన త్రినాథరావు నక్కిన చెప్పిన కథ వెంకటేష్ కి నచ్చిందని, ఈ సినిమాకి కనుక వెంకటేష్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తే మరోసారి పోలీస్ పాత్రలో వెంకటేష్ చెలరిగేయిపోయే అవకాశం ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రినాద్ రావు నక్కిన రామ్ తో "హలో గురు ప్రేమ కోసమేరా" అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకటేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని స్టార్ట్ చేస్తాడు ఈ దర్శకుడు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.