24 ముద్దులు అంటున్న రాజ్ తరుణ్ హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:52:15

24 ముద్దులు అంటున్న రాజ్ తరుణ్ హీరోయిన్

"కుమారి 21 ఎఫ్" సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీ లో హాట్ హీరోయిన్ గా నాటుకుపోయింది హేబ్బా పటేల్. ఆ మూవీ తరువాత రాజ్ తరుణ్ ఇంకా మంచు విష్ణు తో కలిసి నటించిన "ఆడో రకం ఈడో రకం" కూడా మంచి హిట్ గా నిలిచింది. కాని తరువాత వచ్చిన ఫ్లాప్స్ వల్ల హేబ్బా పటేల్ అసలు ఎక్కడ కనిపించకుండా పోయింది.

అయితే మళ్ళి చాలా కాలం తరువాత ఒక రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ భామ. "24 కిస్సేస్" అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ ఇటివలే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో మళ్ళి మనం హేబ్బా పటేల్ ని పూర్తి స్తాయి హాట్ అవతార్ లో చూసే అవకాశం ఉందని పోస్టర్ చూస్తె తెలుస్తుంది. "మిణుగురులు" సినిమా తో నేషనల్ అవార్డు ని అందుకున్న అయోధ్య కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మరి స్టార్ హీరోయిన్ ప్లేస్ లోకి రావడానికి ఎంతో ట్రై చేస్తున్న హేబ్బా పటేల్ ఈ సినిమాతో ఆ లీగ్ లోకి ఎంటర్ అవుతుందో లేదో చూడాలి.

షేర్ :