స‌ల్మాన్ తో కూడా నిల‌బెట్ట‌లేక‌పోయింది?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine iliyana d cruz image
Updated:  2018-03-15 04:59:36

స‌ల్మాన్ తో కూడా నిల‌బెట్ట‌లేక‌పోయింది?

ఒక‌ప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగి, అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఇలియాన...కాని ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాలు రాక‌ స‌త‌మ‌త‌మైపోతోంది ఈ అందాల భామ‌..  వెండితెర‌లో ద‌క్షిణాది త‌మిళ‌, మ‌ళ‌యాల భామ‌ల హ‌వా పెరిగిపోవ‌డంతో పాత హీరోయిన్స్ కు అవ‌కాశాలు క‌నుమ‌రుగైపోతున్నాయ‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు.
 
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇలియాన పోకిరి, కిక్, జులాయి వంటి చిత్రాల‌లో అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు  తెచ్చుకుంది.. ఈ వ‌య్యారి భామ‌ ఆ తర్వాత బాలీవుడ్ లోకి చెక్కేసింది... అక్క‌డ కూడా ప‌లు చిత్రాల‌లో న‌టించినా ఆమెకు అక్క‌డ పెద్ద‌గా గుర్తింపు రాలేదు... అయితే ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను రాణించ‌లేక పోవ‌డంతో ఎవ‌రైనా అవ‌కాశాలు ఇస్తారా అని ఆశ‌గా ఎదురు చూస్తుంది ఈ అందాల భామ‌.
 
గ‌తంలో టాలీవుడ్ లో పోకిరి, కిక్ సినిమాలు హిట్ అయ్యాయి.. ఇక ఆ సినిమాలు, బాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యాయి. ఈ సినిమాల‌కు బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్  రీమేక్ లో న‌టించేందుకు అంగీక‌రించాడు. అయితే హీరోయిన్‌ ఎవ‌రిని తీసుకోవాలి అని ద‌ర్శ‌క నిర్మాత‌లు చ‌ర్చ జ‌రిపిన‌ప్పుడు... తెలుగులో ఎంతో బాగా న‌టించిన ఇలియానాకే అవ‌కాశం ఇచ్చాడు స‌ల్మాన్‌.... కానీ ఈ అమ్మ‌డు వాటిని స‌రిగా వినియొగించుకోలేక పోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.