కాజల్ అంత తీస్కుంటుందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine kajal
Updated:  2018-10-06 03:04:02

కాజల్ అంత తీస్కుంటుందా..?

ప్రతి పరిశ్రమలో సీనియారిటీ పెరిగే కొద్దీ, వచ్చే మనీ, అవకాశాల సంఖ్య పెరుగుతూ ఉంటాయి.. కానీ సినిమా పరిశ్రమ దానికి విరుద్ధం..ఇది గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇక్కడ హీరోయిన్లు సీనియర్లు అయ్యే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి.. వచ్చే అరకొర అవకాశాలు కి రెమ్యునరేషన్ తక్కువ వస్తది.. కానీ ఒక్క భామ విషయం లో ఈ లాజిక్ తలకిందులైంది అనిపించక మానదు..

అగ్ర హీరోల సరసన నటిస్తూనే, సీనియర్ హీరో లతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ,ఇప్పుడు కుర్ర హీరో తో కూడా జతకట్టి పెద్దస్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది... ఇంతకీ ఆ భామ ఎవరో కాదు.. కాజల్ అగర్వాల్... లక్ష్మీ కళ్యాణం తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన నటించింది.. మగధీర లో చరణ్ పక్కన నటించిన ఈ భామ, ఖైదీ నం.150 లో తండ్రి పక్కన కూడా నటించి ఆశ్చర్య పరిచింది..

గత ఏడాది నేనే రాజు..నేనే మంత్రి లో రానా కి జంట గా నటించింది. ఆ తరువాత ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కాజల్ ఏ హీరోయిన్.. ఈ సినిమాకు గాను కాజల్ తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీస్కునట్టు సమాచారం.. ఇంతకి ఆ రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటున్నారు.. అక్షరాల కోటి, డబ్భై అయిదు లక్షలు.. యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా, కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకొంటున్నది.. అందుకే అగ్ర తాంబూలం అందుకుంటుంది అంటున్నారు సినీ వర్గాల వారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.