కేవలం కీర్తీ సురేష్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యింది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 13:27:18

కేవలం కీర్తీ సురేష్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యింది

మలయాళ బ్యూటీ అయిన కీర్తీ సురేష్ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా నటించిన సినిమా మహానటి. అలనాటి మేటి నటి అయిన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మే 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటివలే ఈ సినిమా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. 

అయితే తెలుగు లో ఈ సినిమా రూ.75 కోట్ల తమిళ్ లో రూ.42.5 కోట్ల షేర్ ను వసూలు చేసి మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ని చిత్ర యూనిట్  రూ.25-30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ చాలా అద్భుతంగా నటించింది.

కేవలం కీర్తీ సురేష్ నటన వల్లే ఈ సినిమాకి ఈ రేంజ్‌ కలెక్షన్స్ వచ్చాయి అన్నవారు లేకపోలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం అయిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమంతా ఇంకా విజయ్ దేవరకొండ కూడా నటించారు. వైజయంతి మూవీస్ పై అశ్విని దత్ కుమార్తెలు అయిన ప్రియాంక దత్ ఇంకా స్వప్న దత్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేసారు.

 

షేర్ :