భలే ఛాన్స్ కొట్టేసిన "ఆర్ ఎక్స్ 100" భామ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine payal rajput
Updated:  2018-07-27 12:36:07

భలే ఛాన్స్ కొట్టేసిన "ఆర్ ఎక్స్ 100" భామ

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఒక చిత్రం రూపుదిద్దుకోబోతుందన్న సంగతి తెలిసిందే. అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.
 
ఇక ఈ చిత్రంలో మరో నాయిక ఎంపికైనట్టు సమాచారం, ఆ భామ మరెవరో కాదు ఇటీవలే చిన్న చిత్రంగా విడుదలై అద్భుత విజయం అందుకున్న "ఆర్ ఎక్స్ 100" చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి చిత్రంలోనే చాలా బోల్డ్ గా నటించి, యూత్ కి ప్రస్తుతం హాట్ ఫెవరెట్ గా మారిన పాయల్ అయితేనే తన సినిమాలో పాత్రకు న్యాయం చేయగలదని భావించిన తేజ,సెకండ్ హీరోయిన్ రోల్ లో ఆమెను ఫిక్స్ చేశాడట..
 
అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక ఈ చిత్రంతో పాటు పాయల్ కి ఇప్పుడు మరికొన్ని చిత్రాలు రెడీగా ఉన్నట్లు సమాచారం, దీని బట్టి చూస్తుంటే పాయల్ కి ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్నట్లు కనిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.