ఎంత ప‌ని చేశావు సీత‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-29 10:44:54

ఎంత ప‌ని చేశావు సీత‌

డేగ చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ, ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ చిత్రంతో గుర్తింపు రాక‌పోయినా...కంచె సినిమాతో, సీత పాత్ర‌లో న‌టించి... తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది ఈ అమ్మ‌డు. అ త‌రువాత అవ‌కాశాలు లేక యువ హీరోల స‌ర‌స‌న న‌టించి అందాలు ఆర‌బోసింది ప్ర‌గ్యా జైస్వాల్‌.
ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా విజ‌యం సాధించ‌డానికి సంప్ర‌దాయంతో పాటు, గ్లామ‌ర్ కూడా అవ‌స‌రం. అయితే ఇటీవ‌ల ఓ ఆడియో వేడుకకు మోడ్ర‌న్ డ్ర‌స్‌లో హ‌జ‌రైంది ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ అమ్మ‌డును చూసిన కొంద‌రు మీరు కంచె సినిమాలో సీత పాత్ర‌లో న‌టించారు... కాబ‌ట్టి రాజకుమారిలా చీర‌లో రావాలంటూ చెప్పార‌ట‌.
సీత పాత్ర‌లో గుర్తుంచుకున్నందుకు సంతోష‌మే.... కానీ ఒకే ర‌క‌మైన‌ పాత్ర‌లో న‌టించ‌డం నాకు ఇష్టం లేదు. నాకు వైవిధ్య‌మైన క్యారెక్ట్‌ర్‌ల‌లో తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించ‌డం సంతృప్తిని ఇస్తుంది అన్నారు ప్ర‌గ్యా.. సంప్ర‌దాయంతో వ‌చ్చిన గుర్తింపును పోగొట్టుకోవ‌డానికే... జయ జానకి నాయకలో పూర్తి స్థాయి గ్లామర్ చూపించాన‌ని ప్రగ్యా చెప్పింది, తాజా వేడుక వ‌ద్ద‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.