నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు చూపిస్తా...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-19 04:53:29

నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు చూపిస్తా...

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొద్ది కాలంగా ద‌క్షిణాది భామ‌ల హ‌వా ఏ రేంజ్ లో  కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే... మొద‌ట్లో చిన్న‌హీరోల సినిమాల‌లో న‌టించి, తెలుగు రాకున్నా కానీ క‌ష్ట‌ప‌డి వారి మాట‌ల‌కు వారే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ... ప్ర‌స్తుతం చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంటున్నారు ఈ ముద్దు గుమ్మ‌లు...  ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్ల జోర్ ను త‌గ్గించే దిశ‌గా,  ప‌లువురు ద‌క్షిణాది భామ‌లు చూస్తున్నారట‌... ఈ దిశ‌గానే ప్ర‌య‌త్నాలు కూడా  ముమ్మ‌రంగా  చేస్తున్నార‌ట‌.
 
దీంతో  రాశీఖ‌న్నా, ర‌కుల్ వంటి స్టార్ హీరోయిన్ లు ఏ మాత్రం త‌గ్గ‌కుండా తాము కూడా ఫామ్ లో ఉన్నామంటూ బ‌య‌టకు వ‌స్తున్నారు... ఈ మ‌ధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం త‌న అందచందాల‌ను చూపిస్తూ దిగిన హాట్ పిక్ ప్ర‌స్తుతం సంచలనంగా మారుతోంది.
 
ఈ ఫోటోతో త‌న బాడీలో అందం ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని చెబుతోంది ర‌కుల్....గ‌డిచిన చిత్రాల‌లో ఏ సినిమాలో చూపించ‌ని  విధంగా త‌న ఒంపు సొంపు  అందాల‌ను ఈ మ్యాగజైన్ కవర్ పేజీలో  చూపిస్తోంది ర‌కుల్... తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ రోల్ లో కొన‌సాగుతున్న ర‌కుల్... ఈ ఎక్స్ పోజింగ్ ఫోటోల‌ను చూడ‌గానే  కొంత‌ మంది నెటిజ‌న్లు ఆమెపై  సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ చేస్తున్నారు... 
 
కేవ‌లం చిత్ర పరిశ్ర‌మ‌లో సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌డం వ‌ల్లే ర‌కుల్ ఇలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని నెటిజ‌న్లు త‌మ దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు... దీంతో వారు చేసిన కామెంట్ల పై పంజాబీ బ్యూటీ స్పందించారు... నాకు లేని అభ్యంత‌రం  మీకెందుక‌ని, నా స్టిల్స్ నా ఇష్టం...నాకు ఇష్టం వ‌చ్చిన‌ట్లు నేను చూపించుకుంటాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.