ప్రేమలో పడ్డ రకుల్ ప్రీత్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rakul
Updated:  2018-09-07 01:46:46

ప్రేమలో పడ్డ రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తీసిన ప్రతీ సినిమా హిట్ కావడంతో గోల్డెన్ గర్ల్ గా పెరు సంపాదించుకుని ఆఫర్ లాన్ని బుట్టలో వేసుకుని ఇల్లు చక్కబెట్టుకుంది. ఇప్పుడు పాపం పాప కి వయసు గుర్తొచ్చినట్టుంది ఓ కుర్రాడితో తిరగడం మొదలెట్టింది.
 
ఈ భామ ఇప్పుడు ఒక కుర్రాడితో ప్రేమయాణం సాగిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ కుర్రాడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడు కావడం గమనార్హం. వీళ్ళిద్దరి మధ్య గతకొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం లో ఈ ముద్దుగుమ్మ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిందని ఫిల్మ్ నగర్ టాక్.
 
ఈ మధ్య ఎటు చూసినా ఈ జంట దర్శనం ఇస్తున్నారు.ఆషాడం వచ్చిన కొత్త మొగుడు పెళ్ళాం లా ఎక్కడపడితే అక్కడ కనబడి సందడి చేస్తున్నారు. ప్రైవేట్ పార్టీలకు వెళ్ళడమే కాదు.. ఇండస్ట్రీలో జరిగే ప్రతీ ఈవెంట్‌కి ఇద్దరూ కలిసే హాజరవుతున్నారు. ఈ మధ్య ఓ ఫారిన్ ట్రిప్‌ కు కూడా వెళ్లారని వినికిడి.
 
గోవాలో కూడా ఈ బ్యూటీ ఆ కుర్రాడితో దర్శనం ఇచ్చింది అంతే కాదు గోవా తాలూకు ఫోటో లు బయటకు పొక్కడంతో ఈ రూమర్లు భగ్గుమన్నాయి. వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే అయినా ఇండస్ట్రీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని కొందరి సలహా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.